నా లవర్ జోలికొస్తే అంతు చూస్తా.. కత్తితో దాడి చేసిన ఇంటర్ విద్యార్థి

by Disha Web |
నా లవర్ జోలికొస్తే అంతు చూస్తా.. కత్తితో దాడి చేసిన ఇంటర్ విద్యార్థి
X

దిశ, వెబ్‌డెస్క్: తన లవర్ జోలికి వచ్చాడని.. ఇంటర్ విద్యార్థి కత్తితో దాడి చేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌లో నివాసముంటున్న ఓ బాలుడు(16) ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజుల నుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16)తో ప్రేమలో పడ్డాడు. అదే విషయం ఆమెతో చెప్పాడు. దీంతో బాలిక ఆమె బాయ్ ఫ్రెండ్‌‌కు చెప్పింది. కోపంతో ఊగిపోయిన తన బాయ్ ఫ్రెండ్ మిత్రులతో కలిసి బైక్‌లపై ఫిలింనగర్‌కు వచ్చాడు. బాలుడికి కాల్ చేసి పిలిపించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం తన లవర్ జోలికొస్తే ఊరుకోబోనని హెచ్చరించాడు. మాటా మాటా పెరిగి అతడిపై కత్తితో దాడి చేసి కర్రలతో కొట్టారు. అనంతరం గాయపడిన బాలుడితో సెల్ఫీ దిగి తన లవర్‌కు పంపించి మళ్ళీ నీ జోలికి రాడంటూ ఫోన్ చేసి చెప్పాడు. బాలుడిని బైక్ పై ఎక్కించుకొని కొంత దూరం వెళ్లి నడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయాడు. దీనిని గమానించిన పోలీసులు అక్కడికి చేరుకొని జరిగిన విషయం తెలుసుకున్నారు. సంఘటన జరిన ప్రాంతం రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలోకి వస్తుందని అక్కడ ఫిర్యాదు చేయాలని కోరారు. దీంతో బాధితుడు అక్కడికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు పేర్కొన్నారు.


Next Story