తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యోగుల పాత్ర కీలకం

by Seetharam |   ( Updated:2022-10-01 14:31:55.0  )
తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యోగుల పాత్ర కీలకం
X

దిశ, అంబర్ పేట్: తెలంగాణ ఉద్యమంలో టిజీవోస్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని ఎక్సైజ్, క్రీడ, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలలో భాగంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కాపాడుకుంటుందని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిని చాటిచెప్పే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి టిజీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు గండూరి వెంకటేశ్వరులు, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, మహిళా అధ్యక్షురాలు శ్రావణి రెడ్డి, సాయి లక్ష్మి, అనిత రెడ్డి, వరలక్ష్మి, లత, సుజాత, మౌనిక పాల్గొన్నారు.

Next Story

Most Viewed