- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
హోం శాఖా మంత్రి అనితకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. 2022లో నాటి ప్రభుత్వం 6100 పోస్టులతో కానిస్టేబుళ్ళ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేశారు. అయితే కొద్ది రోజులకే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవగా.. కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియను నాటి ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు(మంగళవారం)01-10-2024న గతంలోని అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని హోం మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
కానిస్టేబుల్ నియామక ప్రక్రియను ప్రారంభించినందుకు హోంమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో "అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్రకటించిన హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత కు ధన్యవాదాలు. ప్రిలిమినరీ పరీక్ష తరువాత రిక్రూట్మెంట్ రెండవ దశలో జరగాల్సిన శారీరక ధారుఢ్య పరీక్షలు వేర్వేరు కారణాలతో వాయిదా పడటం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ``ప్రజాదర్భార్``కు వచ్చిన నిరుద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చారు. వీరి వినతిని పరిశీలించాలని హోం మంత్రి గారికి పంపగా, వారు సానుకూలంగా స్పందించి రిక్రూట్మెంట్ ప్రక్రియలో తరువాత దశలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇది కానిస్టేబుల్ అర్హత పరీక్ష పాసైన నిరుద్యోగులకు చాలా సంతోషకరమైన సమాచారం." అని రాసుకొచ్చారు.