శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ప్ర‌చార ర‌థాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

by Seetharam |
శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ప్ర‌చార ర‌థాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి
X

దిశ, ముషీరాబాద్ : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో టిటిడి ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 15 వరకు జరిగే శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల కార్యక్రమాన్ని సోమ‌వారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోస్టర్ ఆవిష్కరించి ప్రచార రథం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోని వారికి స్వామి వారి దర్శనభాగ్యం ఇక్కడ కల్పించడం గొప్ప కార్యక్రమాన్ని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలను, టిటిడి చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిరుమలేశున్ని దర్శించుకోవాలని కోరారు. తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా అదేవిధంగా పూజలు జరుగుతాయని స్వామివారి లడ్డు ప్రసాదం కూడా భక్తులకు ఉచితంగా అందజేస్తారని ఈ మహత్కార్యంలో పాల్గొని స్వామి కృప పొందాలన్నారు.

Next Story

Most Viewed