- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రి ఇలాకాలో పాల కేంద్రం కబ్జా.. పట్టించుకోని అధికారులు

దిశ, బేగంపేట: ప్రజాప్రతినిధుల అలసత్వం కొంత మంది కబ్జాదారులకు వరంగా మారింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలాకాలో పాల విక్రయ కేంద్రం కబ్జాకు గురి కావడం గమనార్హం. జీహెచ్ఎంసీ పార్క్‌లో నిర్మించిన పాల విక్రయ కేంద్రాన్ని ఓ వ్యక్తి ఏకంగా కబ్జా చేశాడు. సనత్ నగర్ నియోజకవర్గం పెండర్ గాస్ట్ రోడ్‌లోని సింధీభవన్ ఎదురుగా ఉండే పార్క్‌లో పాలు, పాల ఉత్పత్తులు విక్రయించేందుకు గత కొద్ది దశాబ్దాల క్రితం ఓ గదిని నిర్మించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ పార్క్ నిర్వహణ, గది నిర్వహణ చూసుకునే వారు.
ఇదే అదనుగా పార్క్ ప్రక్కన హోటల్, టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కన్ను దీనిపై పడింది. ఈ గది మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుని ఇక్కడే వంటా వార్పు మొదలు పెట్టాడు. హోటల్ సామాగ్రి మొత్తం ఈ గదిలో పెట్టుకుని తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కొంత మంది జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు ఇతని వద్ద నెలవారి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
గతంలో హెచ్చరించినా..
గతంలో ఒక సారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రాంతంలో పర్యటించారు. అప్పుడు ఇక్కడ ఈ గది కబ్జాకు గురి కావడం చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. కానీ, అప్పట్లో కొద్ది రోజులు ఖాళీ చేయించినా అధికారులు, మంత్రి అనుచరులు కబ్జాదారులకు వత్తాసు పలికారు. ఇప్పటికైనా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనిపై దృష్టి పెట్టి, కబ్జాకు గురైన గదిని ఖాళీ చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.