ఈ నెల 11న మెగా జాబ్​ మేళా

by Disha Web Desk 15 |
ఈ నెల 11న మెగా జాబ్​ మేళా
X

దిశ, చార్మినార్ : ​ రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో 11న మెగా జాబ్​ మేళా నిర్వహించనున్నామని, నగరంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్​ మేనేజింగ్​ డైరెక్టర్​ కె.వేణుగోపాల్​ రావు కోరారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగానే సరూర్​నగర్​ స్టేడియంలో 11న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్​ మేళా ఉంటుందన్నారు. దాదాపు 108 కంపెనీలలో 10వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్​, అండర్​ గ్రాడ్యుయేట్​, డిప్లొమా, బీఏ, బీకామ్​, ఎంఏ, ఎంకామ్​, బీ ఫార్మసి, ఎం.ఫార్మసి, బీ ఈ, బీటెక్​, ఎంటెక్​, ఎంబీఏ, ఎంసీఏ, హోటల్​ మేనేజ్​మెంట్​, డ్రైవర్స్​ అర్హతలు కలిగిన వారు ఈ జాబ్​ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9182476721, 9014846853, 6202374845లకు సంప్రదించాలని సూచించారు.


Next Story

Most Viewed