ఓయూ జాబ్ మేళాకు విశేష స్పందన... 50 వేలకు పైగా హాజరైన అభ్యర్థులు

by S Gopi |
ఓయూ జాబ్ మేళాకు విశేష స్పందన... 50 వేలకు పైగా హాజరైన అభ్యర్థులు
X

దిశ, సికింద్రాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించే దిశగా పలు స్వచ్చంద సంస్థల సహకారంతో నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల వ్యవస్థాపకురాలు మూబరు సుభద్ర రాణి ఓయూలో రెండు రోజులపాటు జాబ్ మేళాను నిర్వహించారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్, ఏబీవీ ఫౌండేషన్, ఐఎఫ్ఎఎన్ గ్లోబల్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, దేవకి ఫౌండేషన్, రైస్ ఫౌండేషన్, జేడీ ఫౌండేషన్, ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు దాదాపు 50 వేలకు పైగా అభ్యర్థులు రాగా 14,000 వేల మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఓ బీటెక్ విద్యార్థికి సాక్ట్ సెట్ (ఎస్ఎసిటీఎస్ఈటీ) అనే కంపెనీ రూ. 9 లక్షల భారీ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే విద్యార్థులు తమలోని ప్రత్యేక నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు సహకరించిన సంస్థలకు, మేళా నిర్వాహకురాలిని అయన అభినందించారు.

Next Story

Most Viewed