- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీడియా రంగంలో ఆ స్కిల్స్ అవసరం: హోంమంత్రి మహమూద్ అలీ

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన స్కిల్స్ అవసరమని, తదనుగుణంగా మీడియా సంస్థలు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మాసబ్ ట్యాంక్‌లోని సిరిని హైట్స్‌లో సోమవారం ఛాలెంజర్ మీడియా ఇనిస్టిట్యూట్‌ను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఉర్ధూ, ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాలలో శిక్షణ ఇచ్చే సంస్థగా ఛాలెంజర్ సంస్థ ఆవిర్భవించడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపే నిపుణులను తయారు చేయాలని ఆకాంక్షించారు.
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. మీడియా ఛాలెంజర్ మీడియా ఇనిస్టిట్యూట్‌కు అవసరమైన సహాయ సహాకారాలను అందజేస్తామన్నారు. సీఎంబీ అకాడమిక్ డైరెక్టర్ తబ్రేజ్ తాజ్ మాట్లాడుతూ.. జర్నలిజం వృత్తిలో రాణించాలనుకునే వారు కోర్సులలో చేరవచ్చని సూచించారు. యాంకర్, కెమెరామెన్, మీడియా రిపోర్టర్, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్, డిజిటల్ మార్కెటర్, వెబ్ డిజైనర్, యానిమేటర్, ఆపరేటర్ వంటి అంశాల్లో శిక్షణ కోర్సులను మూడు మాధ్యమాలలో అందజేయనున్నట్లు వెల్లడించారు. తమ వద్ద చేరే విద్యార్థులకు ఉపకారవేతనాలు కూడా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎఫ్సీ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, మున్సిప్ టీవీ సీఈఓ, వ్యవస్థాపకులు, సీఎంబీ అకాడమిక్ డైరెక్టర్ తబ్రేజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు మాజిద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.