భారీగా నాన్-డ్యూటీ మద్యం పట్టివేత..

by Taduka Kalyani |

విస్కీ రామ్ విదేశీ మద్యం ఏది కావాలన్నా నిపన్ ధర అనే వ్యక్తికి ఫోన్ చేస్తే చాలు కారులో తీసుకువచ్చి ఇంటికి ఇచ్చేస్తూ ఉంటాడు..ఇలా చాలా రోజులుగా నాన్ డ్యూటీ పై లిక్కర్ అమ్మకాలు జరుపుతూ సికింద్రాబాద్ డిటిఎఫ్ సిబ్బందికి పట్టుబడ్డాడు.

భారీగా నాన్-డ్యూటీ మద్యం పట్టివేత..
X

దిశ, బేగంపేట : విస్కీ రామ్ విదేశీ మద్యం ఏది కావాలన్నా నిపన్ ధర అనే వ్యక్తికి ఫోన్ చేస్తే చాలు కారులో తీసుకువచ్చి ఇంటికి ఇచ్చేస్తూ ఉంటాడు..ఇలా చాలా రోజులుగా నాన్ డ్యూటీ పై లిక్కర్ అమ్మకాలు జరుపుతూ సికింద్రాబాద్ డిటిఎఫ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ బగారా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో మంగళవారం ఆగి ఉన్న కార్ లో నాన్ డ్యూటీ లిక్కర్ ఉందనే సమాచారం మేరకు.. సికింద్రాబాద్ డి టి ఎఫ్ సీఐ సావిత్రి సౌజన్య సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. కారులో 85 మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని కారు కూడా సీజ్ చేశారు. నిందితుడు నితిన్ ధార (35) అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం బాటిల్ లభ్యమైన అనంతరం నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ సీఐ నాగరాజు సిబ్బంది సహాయం తీసుకున్నారు. నిందితుడు వద్ద 85 మద్యం బాటిల్లను కారును సీజ్ చేసి మద్యం బాటిల్లను నిపన్ ద్వారాను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు సీఐ సౌజన్య సావిత్రి తెలిపారు. స్వాధీనం చేసుకున్నటువంటి మద్యం బాటిల్ల విలువ రూ. మూడు లక్షలగా ఉంటుందని అంచనా వేశారు.ఈ మద్యం బాటిల్లలో హర్యానా ఢిల్లీ వెస్ట్ బెంగాల్ కర్ణాటక గోవా ఏపీ డిఫెన్స్ బాటిల్స్ ఉన్నట్టుగా గుర్తించారు.ఈ మద్యం బాటిళ్లలో శివాజీ రీగల్ జాన్సన్ జానీ వాకర్ గ్రూప్ లాంటి అనేక విదేశీ ఖరీదైన మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు.

Next Story