- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ఆ పార్టీ గెలుపుకు కృషి చేయండి : మందకృష్ణ మాదిగ

దిశ, ఖైరతాబాద్: రానున్న ఎన్నికల్లో మాదిగలు.. బీజేపీకి మద్దతనిచ్చి ఆ పార్టీ గెలుపుకు కృషి చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం ప్రెస్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ విషయంలో బీఅర్ఏస్, కాంగ్రెస్ పార్టీలు తమను ఏళ్ల తరబడి మోసం చేశాయని అందుకే స్పష్టమైన హామీ ఇచ్చిన మోడీ అధ్వర్యం లోని బీజేపీకి మద్దతు నివ్వాలని మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. బీసీని ముఖ్యమంత్రిగా చూడాలనేది బీసీలు అందరితోపాటు దశాబ్దాల కాలంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నా కల కూడా అన్నారు. దళితుల్లో ఒక కులానికి నాయకత్వం వహిస్తున్న నేను కలగంటున్న స్వప్నం అని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి ఇప్పటివరకు మాదిగలు చేసిన ప్రతి పోరాటంలో అత్యంత నమ్మకంగా మాదిగల వైపు నిలబడ్డారు. బీజేపీ మేనిఫెస్టోలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించింది. తెలంగాణ బీసీ బిడ్డలంతా ఈ విషయం గమనించి తమకు రాజ్యాధికారం కావాలో లేక దొరల పాలన కావాలో తేల్చుకొని 30వ తేదీనా తమ ఓటును వినియోగించు కోవాలని కోరారు.