హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గే.. బాణసంచా పేల్చి నేతల హడావుడి

by S Gopi |   ( Updated:2022-10-08 06:56:45.0  )
హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గే.. బాణసంచా పేల్చి నేతల హడావుడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే నేడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఖర్గేకు బేగంపేట విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసురాజు, పొన్నాల లక్ష్మయ్య, వి.హెచ్, మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, హర్కర వేణుగోపాల్ తదితరులు ఎయిర్ పోర్టులో మల్లికార్జున ఖర్గేకు స్వాగతం పలికారు. మల్లికార్జున ఖర్గే వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా నగరానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం గాంధీభవన్‌ లో టీపీసీసీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో గాంధీభవన్ చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికల బరిలో ఖర్గే పోటీ చేస్తున్నందుకు నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేతోపాటు శశిథరూర్ కూడా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed