వరదలో చిక్కుకున్న లారీ.. వారి ప్రాణాలు రక్షించిన ట్రాఫిక్ పోలీసులు

by samatah |
వరదలో చిక్కుకున్న లారీ.. వారి ప్రాణాలు రక్షించిన ట్రాఫిక్ పోలీసులు
X

దిశ, శేరిలింగంపల్లి : భారీ వర్షం, వరదల కారణంగా రోడ్డుపైకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్.ఆర్ ఎగ్జిట్ నెం15 అండర్ పాస్ వద్ద సర్వీస్ రోడ్డును బ్యారికేడ్ల సహాయంతో మూసివేశారు. అయితే రాత్రి పూట ఎవరు లేని సమయంలో ఓలారీ బ్యారికేడ్లను తీసుకోని ఆ రోడ్డు నుండి వెళ్ళడానికి ప్రయత్నించడంతో వరద నీటిలో మునిగి పోయింది. లారీలో ఉన్న డ్రైవర్, ఇద్దరు కూలీలు టాప్ పై చిక్కుకు పోయారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఓ ఆర్ ఆర్ పెట్రోల్ మొబైల్ సిబ్బంది ధనరాజ్ గౌడ్, శివ శంకర్, గణేష్ వారిని తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాణాపాయం నుండి కాపాడిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలలో, వరద నీటిలో పోలీసులు నిషేధించిన ప్రాంతాలలో ఎట్టి పరిస్థితులలోను వెళ్లోద్దని సైబరాబాద్ పోలీస్ లు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed