విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి

by Disha Web |
విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి
X

దిశ, శేరిలింగంపల్లి: కరెంట్ షాక్ తో లైన్ మెన్ మృతి చెందిన ఘటన జగద్గిరగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గతరాత్రి ఈదురుగాలులు, వడగండ్ల వానతో ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ఎల్లమ్మ బండ, పీజేఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఆ ఏరియా లైన్ మెన్ గా పనిచేస్తున్న నర్సింగ్ (35) విద్యుత్ మరమ్మతులు చేస్తున్న సమయంలో కరెంట్ సరఫరా కావడంతో షాక్ తగిలి అచేతనంగా మారాడు. వెంటనే తోటి సిబ్బంది కేపీహెచ్ బీలోని రెమెడీ ఆస్పత్రికి తరలించగా నర్సింగ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న జగద్గిరగుట్ట పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దుందిగల్ కు చెందిన నర్సింగ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story