అధికార, ప్రతిపక్ష నాయకులు పోటీపడి మరీ షెడ్ల నిర్మాణాలు..

by Disha WebDesk |
అధికార, ప్రతిపక్ష నాయకులు పోటీపడి  మరీ షెడ్ల నిర్మాణాలు..
X

దిశ, శేరిలింగంపల్లి: వివాదాస్పద భూముల్లో నిర్మాణాలు సాగించడం, అనుమతులు లేకుండానే కట్టడాలు కట్టడం, ఒకదానికోసం అనుమతులు తీసుకుని మరో నిర్మాణం చేపట్టడం శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో పరిపాటిగా మారింది. అలాంటి వాటివైపు అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదు. వారికి రాజకీయ అండదండలు ఉన్నాయి తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇదే నిర్మాణదారులకు వరంగా మారుతోంది. దీంతో నిర్మాణదారులు జోరుగా పనులు సాగిస్తున్నారు. ఇందులో అధికార, ప్రతిపక్ష నాయకులు మరీ పోటీపడి షెడ్లు వేసేస్తున్నారు.

మాతృశ్రీ నగర్ లో షెడ్ నిర్మాణం..

శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో పలు డివిజన్లలో జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయి. మాతృశ్రీ నగర్ లో ఓ నిర్మాణదారుడు పెద్ద ఎత్తున షెడ్ నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావచ్చి వచ్చాయి. దీనికి టౌన్ ప్లానింగ్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేవు. కానీ పనులు మాత్రం నిరాటంకంగా సాగుతున్నాయి. ఇదే విషయంపై అక్కడ ఉన్నవారిని అధికారులు అడిగితే ఇది ఓ టీఆర్ ఎస్ కార్పొరేటర్ స్థలం. షెడ్ కూడా ఆయనదే, పర్మిషన్లు అన్నీ సార్ చూసుకుంటాడు, మీరు అధికారులైతే ఏంటి అని దబాయిస్తున్నట్లు సమాచారం. దీంతో చేసేదేం లేక కిందిస్థాయి సిబ్బంది కూడా అక్కడి వరకు వెళ్లి ఏమీ చేయకుండా వెనుదిరిగి రావాల్సి వస్తుందని అంటున్నారు. నిర్మాణాలకు అనుమతులు తీసుకోకుండా జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్న వారిపట్ల జీహెచ్ఎంసీ అధికారులు మెతకవైఖరి అవలంబించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కొండాపూర్ లోనూ అదే వరస

అధికార పార్టీ నాయకులు మాత్రమే నిర్మాణాలు సాగించాలా.. తామేం తక్కువ కాదనుకున్నారో ఏమో మరో పార్టీ నాయకుడు కూడా ఇల్లీగల్ గా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. కొండాపూర్ డివిజన్ లో ఆయన భవన నిర్మాణ అనుమతులు తీసుకుని షెడ్ పనులు చేపట్టారని సమాచారం. అడిగిన వారికి ఏదైతే ఏంటి, పర్మిషన్ తీసుకున్నాం పనులు సాగిస్తున్నాం.. అడగడానికి మీరెవరూ అంటూ అందరితోనూ కాస్త కటువుగానే వ్యవహరిస్తున్నారని వినికిడి. ఈ రెండు మాత్రమే కాదు ఈ తరహా నిర్మాణాలు చాలానే నడుస్తున్నాయి. ఇలాంటి వాటిపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

బిల్డింగ్ అనుమతులు మాత్రమే ఇచ్చాం: టీపీఎస్ సిబ్బంది

షెడ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు. బిల్డింగ్ కు మాత్రం ఇచ్చాం. వాటిని చూపించి షెడ్లు వేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాటిపై చర్యలు తీసుకుంటాం.We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed