వరిగడ్డి కట్టలు కట్టే యంత్రంలో ఇరుక్కుని నుజ్జునుజ్జయిన చెయ్యి

by Dishanational1 |
వరిగడ్డి కట్టలు కట్టే యంత్రంలో ఇరుక్కుని నుజ్జునుజ్జయిన చెయ్యి
X

దిశ, లక్షెట్టిపేట: ప్యాడీ స్ట్రా బేలర్ యంత్రంలో ప్రమాదవశాత్తూ చెయ్యి ఇరుక్కుని ఓ యువకుడు తీవ్ర గాయాల బారిన పడిన ఘటన లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కూలి పనికి వెళ్లిన దొంతు మహేష్ అనే యువకుడు వరి గడ్డిని కట్టలు కడుతున్న యంత్రంలో కట్టలను తీస్తుండగా కుడి చెయ్యి ఇరుక్కోగా, ఆ చేయి నుజ్జు నుజ్జయ్యి తీవ్రగాయాల పాలయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.


Next Story

Most Viewed