- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Moinabad Farm House Case:: సీపీ కార్యాలయానికి మొయినాబాద్ ముగ్గురు నిందితులు

దిశ, శేరిలింగంపల్లి: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కీలకంగా ఉన్న ముగ్గురు నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతీలను శనివారం మధ్యాహ్నం 2.42 నిమిషాలకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి భారీ బందోబస్తు మధ్య తీసుకువచ్చారు. సీపీ కార్యాలయంలోని గేట్ నెంబర్ ఒకటి నుండి లోపలికి తీసుకువచ్చిన పోలీసులు సీపీ కార్యాలయం మెయిన్ గేట్ నుండి కాకుండా వెనక నుండి లోపలికి పంపించారు. నందకుమార్ కు చెందినదిగా చెబుతున్న ఎక్స్ ఎల్ సిక్స్ వాహనం టీఎస్ 07జేజీ 5788 వాహనంలో నిందితులుగా పేర్కొన్న నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతీలను తీసుకువచ్చారు. ఆ వాహనంలో ముగ్గురు నిందితులు ఉండగా వెనకా ముందు పోలీస్ ఎస్కార్ట్ భద్రతగా వచ్చారు. లోపలికి తీసుకువెళ్లిన అనంతరం సీపీ స్టీఫెన్ రవీంద్ర ఎదుట అడ్వకేట్స్ సమక్షంలో వారి ముగ్గురిచేత సంతకాలు చేయించిన పోలీసులు 2.52 నిమిషాలకు సీపీ కార్యాలయం మెయిన్ ఎంట్రెన్స్ నుండి మీడియాకు తెలియకుండా బయటకు పంపారు. కేవలం 8 నుండి 10 నిమిషాల లోపే ఈ తతంగం అంతా జరగడం విశేషం. హడావుడిగా సీపీ కార్యాలయానికి ముగ్గురు నిందితులను తీసుకువచ్చి అంతే హడావుడిగా సీపీ కార్యాలయం నుండి నాంపల్లి కోర్టుకు తరలించారు.