సెంటర్ తెలియక ఇబ్బందిపడ్డ అభ్యర్థులు... వారిని సమయానికి పరీక్షా కేంద్రాలకు చేర్చిన పోలీసులు

by S Gopi |
సెంటర్ తెలియక ఇబ్బందిపడ్డ అభ్యర్థులు... వారిని సమయానికి పరీక్షా కేంద్రాలకు చేర్చిన పోలీసులు
X

దిశ, శేరిలింగంపల్లి: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి పొరపాటున ఇతర పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చిన ఎగ్జామ్ అభ్యర్థిని గుర్తించి సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సకాలంలో వారిని పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చారు. గ్రూప్ -1 ఎగ్జామ్ కోసం వచ్చిన ఓ యువతి పొరపాటున కూకట్ పల్లి ప్రగతి డిగ్రీ కాలేజీ వద్దకు వెళ్ళింది. ఉన్న కొద్ది సమయంలో తన సెంటర్ కి ఎలా వెళ్ళాలో తోచక ఇబ్బంది పడుతున్న ఆ యువతిని సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీస్ బైక్ రైడర్ కానిస్టేబుల్ వెహికిల్ పై సరైన సమయానికి చైతన్య డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్ సెంటర్ కు చేర్చారు. దీంతో తనను పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి తీసుకువచ్చిన సైబరాబాద్ పోలీసులకు ఆ యువతి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కూకట్ పల్లి ట్రాఫిక్ సీఐ నగేష్ ఇతర పరీక్షా కేంద్రానికి పొరపాటున వచ్చిన ఇద్దరు విద్యార్థులను సమయానికి తమ పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చారు. మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు మొబైల్ వాహనంలో ఇద్దరు విద్యార్థులను పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని పలువురు ప్రశంసించారు.

Next Story