గ్రూప్-1 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంతమంది రాస్తున్నారంటే...?

by S Gopi |
గ్రూప్-1 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంతమంది రాస్తున్నారంటే...?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 3.80 లక్షల మంది ఈనెల 16న జరిగే గ్రూప్ –1 ప్రిలిమినరీ ఎగ్జామ్​కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్యను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది. ఏయే జిల్లాలో ఎంతమంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారనే వివరాలను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనల జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు వీలుగా హెల్ప్​ లైన్ ఏర్పాటు చేసింది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసిన తర్వాత మూడురోజుల్లో ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు టీఎస్​పీఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20లోపు 'కీ' విడుదలయ్యేలా టెంటెటివ్​ షెడ్యూలు సిద్ధం చేసింది. దానిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నిపుణుల కమిటీ ఫైనల్‌ 'కీ'ని ప్రకటిస్తుంది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను రెండు నెలల్లో ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కన ఫిబ్రవరిలో గ్రూప్​వన్​మెయిన్స్​పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి.









Next Story

Most Viewed