కేఏ పాల్ పార్టీ తరఫున మునుగోడు బరిలో గద్దర్....?

by Disha Web |
కేఏ పాల్ పార్టీ తరఫున మునుగోడు బరిలో గద్దర్....?
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో రాజకీయం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. అయితే, మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచి గెలిచేందుకు అన్నీ పార్టీలు తాము అనుకున్న విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కేఏ పాల్ కీలక ప్రకటన చేశాడు. తమ పార్టీ కూడా మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. అదేవిధంగా తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్ అని ప్రకటించాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనను, కుటుంబ పాలనను అంతమొందించేందుకు గద్దర్ తమ పార్టీ చేస్తున్నారని, 90 శాతం మంది ప్రజలు ఆయనను అభిమానిస్తారని, ఈ నేపథ్యంలో గద్దర్ ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తారని ఆశా భావం వ్యక్తం చేశాడు.

Next Story

Most Viewed