- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > డీఏవీ స్కూల్ ఘటనపై మంత్రి సీరియస్... కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
డీఏవీ స్కూల్ ఘటనపై మంత్రి సీరియస్... కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
by S Gopi |

X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఘటనపై ప్రభుత్వం సీరియస్అయింది. నాలుగున్నర ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, కార్ డ్రైవర్ రజిని కుమార్ పై కఠిన చర్యలు చేపట్టాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపాల్ కార్ డ్రైవర్ రజిని కుమార్ తోపాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ సిబ్బంది, యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి 376, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్కూల్ ఇన్చార్జి, టీచర్ నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటు చేసుకుందని, దీంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story