- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శృంగేరి జగద్గురును దర్శించుకున్న బండి సంజయ్
by S Gopi |

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం శృంగేరీ శంకరాచార్య మహా సంస్థానం, దక్షిణాంన్యాయ శృంగేరి శారదా పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం శారదా అమ్మవారిని దర్శించుకుని చంద్రమౌళీశ్వర పూజలో బండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీ తీర్థస్వామి తెలంగాణలోని వివిధ ధార్మిక కార్యక్రమాలను బండి సంజయ్ కు వివరించారు. ధర్మం కోసం పాటుపడాలని బండి సంజయ్ కి సూచించారు. ధర్మం విషయంలో ఏ సమస్య వచ్చినా ముందుండాలని పేర్కొన్నారు. భారతి తీర్థస్వామిని దర్శించుకున్న వారిలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, కరణం పరిణిత శేఖర్, వ్యాసోజుల రాధాకృష్ణ శర్మ ఉన్నారు.
Next Story