పలు గ్రంథాలు ఆవిష్కరణ

by Dishanational1 |
పలు గ్రంథాలు ఆవిష్కరణ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: డాక్టర్ కపిలవాయి లింగమూర్తి సాహిత్య కళాపీఠం, ధర్మ కేతనం సాహిత్య కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సుల్తాన్ బజార్ లోని శ్రీ కృష్ణ దేవరాయంద్ర భాషానిలయంలో ఓరియంటల్ కళాశాల పూర్వ ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ శ్రీరంగాచార్య అధ్యక్షతన సాహిత్య సభలో మహాకవి నగ్నముని పాల్గొని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కళావాచస్పతి డాక్టర్ టీవీ భాస్కరాచార్య రచించిన 'దొరుకునా వవఎల్ తో నేను- కొందరు కొన్ని' , వాస్తు విశారథ ముంజంపల్లి వీరబ్రహ్మాచార్య రచించిన తెలుగు పద్యానువాదం 'స్వర చింతామణి', ఎన్వీ రఘువీర ప్రతాప్ రచించిన 'మహోన్నత వృక్షాలు', డాక్టర్ ఎస్ జగదీశ్వరాచారి రచించిన 'జగతీ శతకం' గ్రంథాలను ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రముఖ కవి ఎర్రోజు లక్ష్మణాచార్యులు, విశిష్ట అతిథిగా డాక్టర్ డి. విజయగణేష్ రెడ్డి, గౌరవ అతిథులుగా ప్రముఖ యోగాచార్య బి. విఠల్ రెడ్డి, ఎల్. వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొని ఆయా పుస్తకాలు చదవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. అంతకుముందు డాక్టర్ వీవీఎల్ నర్సింహారావు తనయుడు విద్యాసాగర్ ప్రార్ధనాగీతం ఆలపించారు. ఈ సందర్భంగా 'దొరుకునా వీవీఎల్ తో నేను- కొందరు కొన్ని' గ్రంథాన్ని రచయిత మహాకవి నగ్నమునికి అంకితమిచ్చారు.



Next Story