ఆకట్టుకున్న చిన్నారుల నృత్యం

by S Gopi |
ఆకట్టుకున్న చిన్నారుల నృత్యం
X

దిశ, అంబర్ పేట్: సంగీత నృత్యాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహక చైర్మన్ వైఎస్అర్ మూర్తి అన్నారు. దసరా శరన్నవరాత్రుల ఉత్శవాలను పురస్కరించుకుని శ్రీలక్ష్మి నగర్ కాలనీలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భాగ్యనగర్ నృత్య, సంగీత అకాడమీ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నవ దుర్గల నృత్యాలు, సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ .. దేవి శరన్నవరాత్రులు సందర్భంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంచి ఆలోచనలు శక్తిని పెంపొందిస్తాయని తెలిపారు. గత 28 సంవత్సరాలుగా దేవాలయములో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల విశిష్టతను వివరించారు. భాగ్యనగర నృత్య, సంగీత అకాడమీ కార్యదర్సి రవి చందర్ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సాంప్రదాయ నృత్యాలతో భక్తి, సంగీతాన్ని పెంపొందిస్తున్నారని కొనియాడారు. కళలు జీవన ప్రమాణాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. కళాకారులు సహస్ర, యామిని, వైభవి, యుక్తశ్రి, తన్వి, ఋతిక, ద్రువిక, అనుజ్ఞ లలిత దేవి ఆధారితముగా ప్రదర్శించిన సంగీత కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ సభ్యులు రామానుజ రావు, వై. కామేశ్వరి, భానుప్రసాద్, సుబ్రమణ్య శాస్త్రీ, వేదుల కనక దుర్గ పాల్గొన్నారు.

Next Story

Most Viewed