రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయాలి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

by Disha Web Desk 20 |
రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయాలి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
X

దిశ, వనస్థలిపురం : మార్నింగ్ వాక్ లో భాగంగా ఎల్.బీ.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హస్తినపురం డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలుసమస్యలను సుధీర్ రెడ్డికి వివరించారు. కాగా కాలనీలలో రోడ్ల నిర్మాణం కోసం దాదాపు 1 కోటి 77 లక్షల రూపాయల నిధులు మంజూరు జరిగినట్లు ఆయన తెలిపారు. ఆ పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని కోరారు. దాంతో పాటు 100 మీటర్ల మేర డ్రైనేజీ పైప్ లైన్స్ వ్యవస్థ ఎర్పాటు చేయాలని కోరారు. అలాగే టీ.కె.ఆర్.బస్ స్టాప్ దగ్గర ట్రంక్ లైన్ ఎర్పాటు చేసి డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బ్యాలన్స్ డ్రైనేజ్ పనులకు నిధులు అతిత్వరలో నిధులు మంజూరు అయ్యేవిధంగా చూస్తానని తెలిపారు. నూతన ట్రంక్ లైన్ పనుల్లో భాగంగా అధికారులతో చర్చించి పనులు జరిపిస్తామని తెలిపారు. మంజూరైన రోడ్లను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా దశలవారీగా పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఏ.ఈ.హేము నాయక్, సత్యంచారి, శ్రీనివాస్ యాదవ్, ఒరుగంటి వెంకటేశం, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆదిలక్ష్మి, అనిత, నాగిరెడ్డి, రోహిత్ రెడ్డి, సాయియాదవ్, మహేందర్, భీమ్లాల్ నాయక్, శ్రీకాంత్ రెడ్డి, సయ్యద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed