- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా ప్రయోగిస్తున్నారు: కేటీఆర్

దిశ, డైనమిక్ బ్యూరో: దర్యాప్తు సంస్థలను తమపై వేట కుక్కల్లా ప్రయోగిస్తారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా తమపై ఈడీ దాడులు జరిపే అవకాశం ఉందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే, బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేసినందుకు తమపై కేంద్రం దర్యాప్తు సంస్థలను ప్రయోగించే అవకాశం ఉందని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ లో ఇద్దరు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని తొందరలో ఆ పార్టీని వీడనున్నట్లు చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని విమర్శలు గుప్పించారు. కేరళలో రాహుల్ భారత్ జోడోయాత్ర చేస్తుంటే గోవాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్క బీజేపీలో చేరారన్నారు.
ఇక దేశంలో 10 వేల మంది మొబైల్ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న ఆయన.. కిషన్ రెడ్డి ఫోన్ నెంబర్ కూడా అందులో ఉందని చెప్పారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ పై ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. కాగా, 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ పార్టీ టార్గెట్‌గా పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికల లోపు బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ రూ. 22 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుందన్నారు. మునుగోడు ఉపఎన్నికకు రూ. 5 వేల కోట్లు ఖర్చు పెడతానని అమిత్ షాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట ఇచ్చారన్నారు. అయితే, మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ముందంజలో ఉందని 'నా వద్ద నివేదికలు ఉన్నాయి' అని కేటీఆర్ చెప్పారు.