ఉస్మానియా యూనివర్సిటీలో యువతిపై కత్తితో దాడి

by Nagaya |
ఉస్మానియా యూనివర్సిటీలో యువతిపై కత్తితో దాడి
X

దిశ, సికింద్రాబాద్: యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ భోలక్ పూర్ ప్రాంతానికి చెందిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువతిపై ఉస్మానియా యూనివర్సిటీ మంజీర హాస్టల్ సమీపంలో శనివారం రాత్రి రంజిత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి చేతికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. దాడిచేసిన నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story