- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేసీఆర్‌కు లేఖ రాశా... ఇప్పటివరకు స్పందన లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతికతపై ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో సైన్స్ సిటీస్, సైన్స్ సెంటర్స్, ఇన్నోవేషన్ హబ్స్ ను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తోందని, అందులో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్(ఎన్‌సీఎస్ఎమ్) ద్వారా 'గ్రీన్‌ఫీల్డ్ సైన్స్ సిటీ'ని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సరైన, అవసరమైన ప్రాంతమని కేంద్ర ప్రభుత్వం భావించి తెలంగాణకు కేటాయించిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం సరైన స్థలాన్ని కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని, ఇప్పటికైనా గ్రీన్ ఫీల్డ్ సైన్స్ సిటీకి అవసరమైన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఒక సైన్స్ సిటీ ఏర్పాటు అవసరముందని ఆయన పేర్కొన్నారు. సైన్స్ సిటీ విద్యార్థుల్లో ప్రయోగాత్మకంగా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు, ప్రశ్నించడం ద్వారా ప్రతిభను పెంచుకునేందుకు, సృజనాత్మక శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకునేందుకు బాటలు వేస్తుందన్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ తృష్ణను పెంపొందించడంలో సైన్స్ సిటీల పాత్ర కీలకమని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు మూడుసార్లు లేఖలు రాసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి కూడా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వివరించారన్నారు. కానీ తెలంగాణ సర్కార్ ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. గ్రీన్ ఫీల్డ్ సైన్స్ సిటీకి హైదరాబాద్ లో 25 ఎకరాల స్థలం, దీనికి సంబంధించిన ఫిజికల్ రిపోర్టు, ఫీజిబిలిటీ రిపోర్టు, డిమాండ్ సర్వే, ఇతర అవసరమైన వివరాలతో కూడిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) తో కూడిన ప్రతిపాదనలు పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని కేసీఆర్ కు రాసిన లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు జాతికి అంకితం
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను మారుమూల ప్రాంతాలకు చేరవేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆదివారం 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను(డీబీయూ) జాతికి అంకితం చేయనుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 75 డీబీయూలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. 2022-23 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోడీ ఈ డీబీయూలను జాతికి అంకితం చేయనున్నారన్నారు. 75 డీబీయూల్లో మూడు తెలంగాణలో, రెండు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, జనగామ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జనగామలో నిర్వహించే కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. డీబీయూల ద్వారా పలు పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరవడం, ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్ తెరవడం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటి డిజిటల్ కిట్లను అందజేయడం, వ్యాపారస్తుల కోసం యూపీఐ క్యూఆర్ కోడ్, భీమ్-ఆధార్, పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్)ను అందుబాటులోకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి :