- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహిళ అండాశయం నుంచి 29.7 కిలోల కణితి తొలగించిన కిమ్స్ వైద్యులు

దిశ, బేగంపేట: ఓ మహిళ గర్భాశంలో ఉన్న 23.7 కిలోల భారీ కణితిని సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు తొలగించి ఆ మహిళ ప్రాణాలు కాపాడారు. ఈ విషయాన్ని శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సికింద్రాబాద్ కిమ్స్ సర్జికల్ ఆంకాలజీ విభాగపు అధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నాగేంద్ర పర్వతనేని తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ పొత్తి కడుపులో నొప్పి కారణంగా స్థానికంగా ఉండే ఓ వైద్యుడిని సంప్రదించింది. అనంతరం కడుపులో కణితి ఉందని.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు.
శస్త్ర చికిత్సతో ప్రాణాలకు కూడా ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆమె గత రెండేళ్ల నుంచి వాయిదా వేస్తూ వస్తుంది. ఈ రెండేళ్లలో కణితి పరిమాణం పెరిగిపోయి పిడికెడు అన్నం తినలేక, గ్లాసు మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితికి చేరుకుంది. కొన్ని వారాల క్రితం ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి.. కాళ్లలో వాపులు వచ్చాయి. రక్తనాళాల్లో కణితి కుదింపుల కారణంగా కింది భాగంలోకి రక్త ప్రసరణకు కూడా ఆటంకం కలుగుతుంది. పడుకున్న సమయంలో వెన్నుపూసపై భారం పడుతుండటంతో పడుకోవడానికి ఇబ్బందులు వస్తుంటాయి. ఇక ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక వైద్యులు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కిమ్స్‌కు తీసుకుని వచ్చారు.
డాక్టర్ నాగేంద్ర పర్వతనేని నేతృత్వంలో సర్జికల్ ఆంకాలజీ వైద్య బృందం ఆమెను పరిశీలించి భారీ సైజులో ఉన్న కణితిని తొలగించడం సవాలుతో కూడుకున్నదని గుర్తించారు. 3 గంటల పాటు ఆమెకు శస్త్ర చికిత్స చేసి అండాశయంలో 23.7 కేజీల 65 సెంటీ మీటర్ల వ్యాసంతో ఉన్న కణితిని తొలగించారు. కిమ్స్‌లో ఉండే అత్యాధునిక ఇమేజింగ్ పరికరాలు, నిపుణులైన వైద్యులు ఉండటం వల్లే శస్త్ర చికిత్స విజయవంతం అయిందని.. ప్రస్తుతం రోగి పరిస్థితి సాధారణంగా ఉండి కోలుకుంటుందని డాక్టర్ నాగేంద్ర పర్వతనేని చెప్పారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ దీప్తి , డాక్టర్ వంశీ తదితర బృందం పాల్గొన్నారు .