ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణాధితికి తొలి పూజ..

by Disha Web Desk 20 |
ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణాధితికి తొలి పూజ..
X

దిశ, ఖైరతాబాద్ : ఖైరతాబాద్ గణనాధునికి తొలి పూజను గవర్నర్‌ తమిళి సై, మంత్రి తలసాని, హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి నిర్వహించారు. 63 అడుగుల ఖైరతాబాద్ మట్టి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. వినాయక చవితి సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు ఖైరతాబాద్‌ వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఖైరతాబాద్ పరిసరాలు అంత కూడా సందడిగా మారింది.

ఈ ఒక్క రోజే లక్ష మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గణేష్ చతుర్థి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటామని హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ తెలిపారు. ప్రతి ఏటా విభిన్న రూపాల్లో దర్శణమిచ్చే మహాగణపతి ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి తొలిపూజలో గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఖైరతాబాద్ మహా గణేశుడికి పూజలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణల మధ్య ఖైరతాబాద్ గణేశుడికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు.

Next Story

Most Viewed