ప్రగతి భవన్‌లో నల్ల పోచమ్మను దర్శించుకున్న కేసీఆర్

by Dishanational1 |
ప్రగతి భవన్‌లో నల్ల పోచమ్మను దర్శించుకున్న కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలకమైన నిర్ణయానికి తీసుకోడానికి నిమిషాల ముందు ప్రగతి భవన్‌‌లోని నల్లపోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై ప్రకటన చేయడానికి ముందు ఈ ఆలయానికి వచ్చి జమ్మి చెట్టుకు వేద పండితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రగతి భవన్‌లోనే ఆయుధ పూజలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు, అక్కడికి చేరుకున్న ప్రజా ప్రతినిధులకు, సీఎంఓ సిబ్బందికి, సెక్యూరిటీ స్టాఫ్‌కు జమ్మి ఆకును పంచిపెట్టి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Read Disha E-paper

Next Story

Most Viewed