- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హబ్సిగూడలో జోయాలుక్కాస్... ప్రారంభించిన నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి

దిశ, సికింద్రాబాద్: జోయాలుక్కాస్ జ్యువెలరీ నగరంలో తమ షోరూంల విస్తరణలో భాగంగా హబ్సిగూడలో తమ జ్యువెలర్ షోరూంను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జాయ్ అలుకాస్ , మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. జ్యువెలరీని కొనుగోలుదారులకు ఆరంభపు ఆఫర్స్ ప్రకటించామన్నారు.
ఈ షోరూం సిగ్నేచర్ జోయాలుక్కాస్ ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా ప్రీమియం సౌకర్యాలను , సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. షోరూంకు ఆధునిక అలంకరణతో పాటు హబ్సిగూడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని షాపింగ్ చేయడానికి వచ్చే వారికి పార్కింగ్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ స్థలం కూడా కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 16 వరకు ప్రతి కొనుగోలుపై కస్టమర్స్ కు ఉచిత బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు.
దీపావళి ఆఫర్ సమయంలో కస్టమర్స్ తాము చేసిన కొనుగోళ్లు పై గిఫ్ట్ వోచర్స్ గా క్యాష్ బ్యాక్ , ఎస్ బి ఐ కార్డ్స్ పై 5 % అదనపు క్యాష్ బ్యాక్ పొందుతారన్నారు. జోయాలుక్కాస్ కస్టమర్లకు పండగ ఆఫర్ తో పాటు , 916 బిఐఎస్ హాల్ మార్క్ గల జ్యువెలరీ , ఒక సంవత్సరం ఉచిత బీమా, జోయాలుక్కాస్ లో కొనుగోలు చేసిన ఏ జ్యువెలరీ కైనా లైఫ్ టైమ్ ఉచిత మెయింటెనెన్స్ భరోసా ప్లస్ వారికి బై - బ్యాక్ గ్యారంటీ కూడా లభిస్తుందన్నారు.