శ్రీపాదరావు లాంటి నేతలు తెలంగాణ ప్రాంతానికి చెందడం గర్వకారణం

by Sridhar Babu |
శ్రీపాదరావు లాంటి నేతలు  తెలంగాణ ప్రాంతానికి చెందడం గర్వకారణం
X

దిశ, రవీంద్రభారతి : శ్రీపాద రావు లాంటి నాయకులు తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మనందరికీ గర్వకారణం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలు శనివారం రవీంద్రభారతి లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ పై ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహనీయుల చరిత్ర తెలియజేయాలని, భావితరాలకు ఆదర్శంగా వారి చరిత్ర కాపాడుకునే

బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. పర్యాటక శాఖ మంత్రి తో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ట్యాంక్ పై బండ్ పై మహనీయుల విగ్రహాల పై విధాన పరమైన ప్రకటన చేస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ సర్పంచి నుండి ఎమ్మెల్యే గా గెలుపొంది ప్రజాలకు ఎంతో సేవ చేశారని, శ్రీపాద రావు ఆశిష్యులతో తాను విద్యార్థి నాయకునిగా ఎదిగానన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీపాద రావుతో ఆయన కుమారుడు శ్రీధర్ బాబుతో చట్టసభల్లో పాల్గొన్న ఏకైక వ్యక్తిని తాను అని, ఆయన అజాత శత్రువని, పేద ప్రజల

పక్షపాతి శ్రీపాద రావు అని కొనియాడారు. శ్రీపాద రావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని సీఎం కి విజ్ఞప్తి చేశారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన తండ్రి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed