తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్న TRS మీటింగ్ చివరి మీటింగా...?

by Disha Web |
తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్న TRS మీటింగ్ చివరి మీటింగా...?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం కొనసాగుతున్నది. ఈ సమావేశానికి ప్రముఖులతోపాటు సభ్యులందరూ హాజరయ్యారు. కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో పార్టీ మార్పుపై సభ్యులకు వివరిస్తూ ఉన్నారు. అనంతరం అందరి ఆమోదయోగం అనంతరం తీర్మానం చేయనున్నారు. తీర్మానం కాపీతో ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లి ఈసీని కలవనున్నారు. అనంతరం పార్టీ పేరు మార్పును కోరనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీ మారుతుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ సమావేశం ఇదే చివరి సమావేశమవుతుందా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed