కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం..

by Disha Web Desk 20 |
కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం..
X

దిశ, అంబర్ పేట్ : దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపన, రాష్ట్ర పరిపాలన భవనానికి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయడం దేశప్రజలకు గర్వకారణమని పలువురు అన్నారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయడాన్ని స్వాగతిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందన సభ ప్రాబుద్ద భారత్ ఇంటర్నేషనల్, సమత సైనిక్ దళ్, ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్ దేవ్ థోరాట్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ దళితులకే కాదని యావత్ సమాజానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప మహనీయుడని కీర్తించారు.

ఆయన ఆశలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా అంబేద్కర్ పేరును పరిపాలన భవనానికి నామకరణం చేయడం జరిగిందన్నారు. సమానత్వానికి ప్రతీక అంబేద్కర్ విగ్రహం నిలుస్తుందన్నారు. తెలంగాణ సమాజానికి అంబేద్కర్ కు విడదీయని అనుబంధం ఉందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ కాకి మాధవ రావు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం విగ్రహం మాత్రమే కాదని సమాజానికి సందేశామన్నారు. పరిపాలన భవనానికి అంబేద్కర్ పేరు నామకరం చేయడం కేసీఆర్ కు దళితులపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించారని పేర్కొన్నారు. టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం నగరంలో ఏర్పాటు చేయడం దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. దళిత బంధు పథకంతో దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. నూతన సచివాలయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి ఆకాశాన్నంటే విగ్రహం ఏర్పాటు చేసిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

పద్మశ్రీ నర్రా రవికుమార్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, బుద్ధవనం ప్రాజెక్టు ఓ ఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, గ్రామోదయ క్యాంపస్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ఢిల్లీ వసంత్, ఎస్సీ ఎస్టీ నేషనల్ ఇంట లెక్చవల్ ఫోరం అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి .రమేష్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, పాలమూరు యూనివర్సిటీ వీసి ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, తెలంగాణ మహిళా యూనివర్సిటీ వీసి ప్రొఫెసర్ విజ్జులత, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కే. సీతా రామారావు, అగ్రికల్చర్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ వెచ్చర్ల ప్రవీణ్ రావు పాల్గొన్నారు.



Next Story

Most Viewed