ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టాలి : వామపక్ష విద్యార్ది సంఘాలు

by Disha Web Desk 15 |
ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టాలి : వామపక్ష విద్యార్ది సంఘాలు
X

దిశ, సికింద్రాబాద్ : ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఉస్మానియా యూనివర్సిటీలో వామపక్ష విద్యార్ది సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ మెయిన్ లైబ్రరీ నుండి లా కళాశాల వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా అమలు చేయాలని తెలిపారు. ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఆరోపించారు. లీకేజీ విషయంలో వెంటనే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. నోటిఫికేషన్స్ రద్దు ద్వారా నష్టపోయిన ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి పరిహారంగా లక్ష రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని కోరారు. కేసీఆర్ తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్ ఎల్ మూర్తి, రవినాయక్, ఏఐఎస్ఎఫ్ నెల్లి సత్య, పీడీఎస్​యూ శ్యామ్, స్వాతి, పీడీఎస్​యూ విజృంభన అఖిల్, విద్యార్థి నాయకులు రామాటేంకి శ్రీను, బాలరాజు, శ్రీను, వినయ్, శభాష్, కృష్ణ, సందీప్, దిలీప్, రాకేష్, మనోజ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story