భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 15 |
భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, అంబర్ పేట్ : భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సమయ పర్ఫామింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ నృత్య కళాకారిణి కొప్పల రాధిక శిష్య బృందం భరత నాట్య ప్రదర్శన రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కళలకు పెద్దపీట వేశారని తెలిపారు. రాధిక కళా రంగంలో మాస్టర్స్ డిగ్రీని పొంది తన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాధిక తన ఐదేళ్ల చిన్న వయస్సులోనే నృత్య ప్రపంచంలోకి ప్రవేశించి కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాలని సూచించారు. సంస్థ వైస్ చైర్మన్ వంశీకృష్ణ గోనె, సినిమా ఫొటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ , అర్బోర్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed