నగరంలో ఘనంగా దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

by Vinod kumar |   ( Updated:2022-08-15 12:58:48.0  )
నగరంలో ఘనంగా దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఉద్యోగ సంఘాల కార్యాలయాలలో పంద్రాగస్టు వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. జాతీయ పతాకాన్ని ఎగుర వేయడం తో పాటు మిఠాయిలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా నాంపల్లిలోని హెచ్ఆర్సీ ఆవరణలో చైర్మన్ జస్టిస్ జీ చంద్రయ్య జాతీయ జెండాను ఎగురవేశారు.

కలెక్టరేట్‌లో..


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అమోయ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అధికారులకు, ఉద్యోగులకు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల కృషి ఫలితమే నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యమన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబ్బద్ధతతో వ్యవహరించారు.


రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలనీ హైదరాబాద్‌ను ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ పునరంకితులు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ సంక్షేమ శాఖాధికారులు రామారావు, టీజీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో..


టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని గృహకల్ప ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ.. వీరమరణం పొందిన యోధుల ఆత్మకు శాంతి కలగాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీమా ముజీబ్, కురాడి శ్రీనివాస్, శంకర్, సయ్యద్ నవాజుద్దీన్, షైలి, నజీర్, వాజీద్, రమేష్, సంపత్, నవీన్, శ్రీను, ఉస్మాన్ అలీ ఉస్మాని, రామకృష్ణారెడ్డి, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

జెండా పండుగలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా..


నాగోల్‌లో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి ఆంగ్లేయుల నుండి విముక్తి లభించిందన్నారు. వారి త్యాగాలు గుర్తుంచుకుని యువత వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

డీఎంహెచ్ఎస్ ఆవరణలో..


కోఠిలోని డీఎం అండ్ హెచ్ఎస్ ఆవరణలో దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీపీహెచ్ డాక్టర్ జీ శ్రీనివాసరావు, శంకర్ , టీఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు మామిడి ప్రభాకర్, నాయకులు హరి, చక్రధర్, క్రాంతి కిరణ్, ఈ కిరణ్ రెడ్డి, వినోద్, ఉద్ధవ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story