శారదా విద్యాలయంలో క్రీడా మైదానం ప్రారంభం

by Disha Web Desk 11 |
శారదా విద్యాలయంలో క్రీడా మైదానం ప్రారంభం
X

దిశ, చార్మినార్: పాతబస్తీ అలియాబాద్​లోని శారదావిద్యాలయంలో క్రీడా మైదానాన్ని మంగళవారం నగర పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​, మాజీ భారత క్రికెట్‌ జట్టు టెస్ట్‌ క్రికెటర్‌ వెంకటపతి రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్​ సీవీ ఆనంద్​ బ్యాట్​తో సందడి చేశారు. అనంతరం వందేళ్ల శారదావిద్యాలయం చరిత్ర తెలిపే ఫొటో గ్యాలరీని ప్రారంభించారు. క్రికెట్‌ అభిమానుల కోసం ఐదు నెట్స్‌తో పాటు బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టులు, అథ్లెటిక్స్‌, స్పోర్ట్స్‌ ఏర్పాట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ మరియు నోహ్‌ సాఫ్ట్‌ వ్యవస్థాపకులు మైనేని, శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ జయంత్‌ ఠాగోర్‌, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్‌ మాదిరెడ్డి, కరస్పాండెంట్‌ జ్యోత్స్న, అంగారా సైతం తదితరులు పాల్గొన్నారు.

Next Story