మహిళా శక్తికి గుర్తుగా స్మారక శిల్పం ప్రారంభం

by Disha Web Desk 15 |
మహిళా శక్తికి గుర్తుగా స్మారక శిల్పం ప్రారంభం
X

దిశ, జూబ్లిహిల్స్ : జూబ్లిహిల్స్ లోని కేబీఆర్ పార్క్ జంక్షన్‌ వద్ద ఎఫ్. ఐ.సీ.సీ. ఐ , ఎఫ్ ఎల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్మారక శిల్పంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నగరానికి చెందిన ప్రముఖ దాతృత్వవేత్త పింకీ రెడ్డి, శుభ్రా మహేశ్వరి ( చైర్‌పర్సన్ - ఎఫ్. ఐ.సి.సి. ఐ , ఎఫ్ ఎల్ ఓ ) కలిసి మహిళా శక్తికి గుర్తుగా స్మారక శిల్పం ను ఆదివారం ప్రారంభించారు. స్టీల్ తో చేయబడిన శిల్పం కే.బీ.ఆర్ పార్క్‌కు అందం తీసుకువచ్చింది అని మేయర్ అన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బెలూన్‌లను గాలిలోకి వదులుతూ ఆ శిల్పాన్ని ఆవిష్కరించారు. ఫ్లో మంచి సంస్థ అని, వారితో తనకు చాలా కాలంగా అనుబంధం ఉందని, కొన్ని సమయాల్లో, నేను ఫ్లో సంస్థలో చేరాలని భావించాను, కానీ నాకు సమయం దొరకడం లేదని తెలిపారు.

బహుశా నేను మేయర్‌గా నా కార్యాలయాన్ని విడిచిపెట్టినప్పుడు, భవిష్యత్తులో సంస్థలో చేర దలిచాను అన్నారు. తను సామాజిక సేవ ద్వారా రాజకీయాల్లోకి వచ్చానని, అది నాకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది అన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ ఎల్ ఓ) చైర్‌పర్సన్ శుభ్రా మహేశ్వరి మాట్లాడుతూ ఫ్లైట్ మహిళా సంరక్షక దేవదూతను పోలి ఉంటుంది అని అన్నారు. ఈ శిల్పం ముందు నుండి స్త్రీ శరీరానికి కవచాన్ని , పక్క వైపు నుండి దేవదూత వలె రెక్కలను పోలి కనిపిస్తుందని పేర్కొన్నారు. మహిళా యోధుని రూపాన్ని సూచిస్తూ శిల్పం మహిళల బలం, భద్రత మరియు స్వేచ్ఛ యొక్క ఆలోచనను కూడా సూచిస్తుంది అన్నారు.


Next Story

Most Viewed