- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా అల్వాల్ సర్కిల్

దిశ, అల్వాల్: అల్వాల్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల జోరు పెరుగుతోంది. అల్వాల్ ప్రాంతం మూడు చెరువులు, కుంటలతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండే ప్రాంతం. కానీ అక్రమ నిర్మాణాలతో నేడు అది కానుమరుగైపోతోంది. ప్రధాన రహదారుల్లో కమర్షియల్ కేంద్రాలకు నిలయంగా మారింది. ఎవరికి తోచిన విధంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అంబేడ్కర్ నగర్ ప్రధాన రహదారి, హైటెన్షన్ రోడ్డు అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా మారిందంటే అతిశయోక్తి కాదు.
వారి అండతోనే..
పేదలు చిన్న ఇల్లు కట్టుకుంటేనే అక్రమ నిర్మాణం అని కూల్చివేసే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పెద్ద పెద్ద నిర్మాణాలు వారికి కనిపించడంలేదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అవినీతితోనే అక్రమ షెడ్ల నిర్మాణాలు పెరెగిపోతున్నాయని ఆరోపణలు లేకపోలేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే సామెకు టౌన్ ప్లానింగ్ అధికారులకు అందులో కమిషనర్‌కు తెలియకుండా ఎలాంటి నిర్మాణం జరగదనేది కూడా అంతే నిజం అంటున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు అందినకాడికి దండుకొని అనుమతి లేని నిర్మాణాలు సర్కిల్ వ్యాప్తంగా పెరుగుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రానురాను విశ్వనగరంవైపు పరుగులు పెడుతున్న మన నగరానికి అక్రమ నిర్మాణాలు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందంటున్నారు. తక్షణమే వీటిని అరికట్టాలని అధికారులను కోరుతున్నారు.