ఐ డోంట్ కేర్.. నాకు బ్యాక్ గ్రౌండ్ ఉంది.. డ్యూటీ టైంలో లిక్కర్ గ్లాస్‌తో ఆఫీసర్?

by Aamani |
ఐ డోంట్ కేర్.. నాకు బ్యాక్ గ్రౌండ్ ఉంది.. డ్యూటీ టైంలో లిక్కర్ గ్లాస్‌తో ఆఫీసర్?
X

దిశ, సిటీక్రైం : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ పోలీస్ కమిషనరేట్‌లోని జోనల్ స్థాయి ఉన్నతాధికారి హోదా కలిగిన ఓ ఆఫీసర్ వ్యవహారంపై కమిషనరేట్ పోలీస్ బాస్ గుస్సా అయినట్లు పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ అధికారి విధుల్లో ఉన్నప్పుడు తన ఆఫీస్‌లోనే మద్యం సేవిస్తున్నాడానే ఆరోపణలు రావడం గమనార్హం. దీంతో పోలీస్ బాస్ క్రమశిక్షణ రాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా జోనల్ స్థాయి హోదా కలిగిన అధికారి పోలీస్ బాస్ కాన్ఫరెన్స్‌లను కూడా సరిగా పట్టించుకోడనే ప్రచారం పోలీస్ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. పౌరులకు సేవలు అందించే క్రమంలో పోలీస్ బాస్ సూచనలు, ఆదేశాలు ఇవ్వాలన్నా అందుబాటులో ఉండడని పోలీస్ వర్గాలు అంటున్నాయి.

ఫోన్లు చేసినా స్పందన ఉండకపోవడంతో ఇప్పుడు ఆ అధికారి వ్యవహారం పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగించేలా తయారైందని పోలీస్ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కమిషనరేట్ పోలీస్ బాస్ యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా ఆ ఆఫీసర్ వెనకాల ఉన్న బ్యాక్ గ్రౌండ్‌తో తనను ఎవరూ టచ్ చేయరని చిటికెలు వేస్తూ ప్రభుత్వాన్ని తిడతాడని పోలీస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఈ జోనల్ స్థాయి హోదా కలిగిన అధికారి ప్రవర్తన పోలీస్ వర్గాలను డిస్టర్బ్ చేస్తుందంటున్నారు. ఇలా ఒక అధికారి ప్రవర్తనతో మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్టకు నష్టం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయాని పోలీస్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.



Next Story

Most Viewed