నా గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ రుణపడి ఉంటా

by Sridhar Babu |
నా గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ రుణపడి ఉంటా
X

దిశ, ఎల్బీనగర్ : ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తన గెలుపు కోసం నిరంతరం కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవీరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సుధీర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సామ రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మాండమైన

ప్రచారం నిర్వహించి తన గెలుపు కోసం కృషి చేశారని తెలిపారు. ఎన్నికల్లో తాను గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించినట్టు చెప్పారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కార్పొరేటర్లు తనను ఓడించడానికి అనేక ఆరోపణలు చేశారని, వారికి తగిన గుణపాఠం చెపుతానని అగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అవుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో తన పేరు ఉన్న మరో వ్యక్తి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అనే వ్యక్తితో నామినేషన్ వేయించారని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆడిన నాటకం అని అన్నారు. ఈ ఎన్నికల్లో తాను గెలుపొందడం ఖాయమని పేర్కొన్నారు.

Next Story

Most Viewed