టామ్కామ్​ కంపెనీ నుంచి భారీగా నోటిఫికేషన్లు

by Disha Web Desk 15 |
టామ్కామ్​ కంపెనీ నుంచి భారీగా నోటిఫికేషన్లు
X

దిశ, కార్వాన్ : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) లో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నట్లు సీఈఓ శనివారం వెల్లడించారు. తెలంగాణలో అర్హత , నైపుణ్యం కలిగిన కార్మికులకు విదేశీ ప్లేస్మెంట్లు సులభతరం చేయడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్, పోలాండ్, రొమేనియా, యూకే దేశాలలో ఉద్యోగాలు ఉన్నాయని వివరించారు. హెచ్ డీ మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఫిట్టర్, సీ ఎన్ సీ మెషినిస్ట్ ,బ్లాస్టర్ పెయింటర్, క్లీనర్, ఫోర్మ్యాన్ బ్లాస్టింగ్ & పెయింటింగ్, ఫోర్మోన్ ప్లేటర్, జీ టీ ఏ డబ్ల్యూ వెల్డర్, ఐటీవీ డ్రైవర్, మెషినిస్ట్, సీఎన్సీ పైప్ ఫిట్టర్, ప్లేటర్ ఫ్యాబ్రికేటర్, స్కాఫోల్డర్లు,

సెక్యూరిటీ సిస్టమ్స్ టెక్నీషియన్, సీనియర్ ఆఫీసర్ - ఆపరేషన్స్, ఒరాకిల్ లీటెక్నాల్ ఫ్యాషన్, అకౌంట్స్ ఆఫీసర్, మేనేజర్ పోస్టులు ఉన్నట్టు చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2 సంవత్సరాల అనుభవం, పాస్​పోర్టు ఉండాలని పేర్కొన్నారు. వీరికి ఆహార వసతి, విమాన టికెట్లు ఇస్తారని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు టామ్కామ్ వెబ్సైట్, మొబైల్ యాప్, లో రిజ్యూంను [email protected] కి ఈ-మెయిల్ చేయవచ్చని, మరిన్ని వివరాల కోసం www.tomcom.telangana.gov.in వెబ్ సైట్ లేదా ఈ నంబర్లకు ఫోన్ చేసి 99519 09863 / 8328602231 తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.



Next Story

Most Viewed