- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫుడ్ డెలివరీ బాయ్ పై హోటల్ సిబ్బంది దాడి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

దిశ, శేరిలింగంపల్లి: ఫుడ్ ఆర్డర్ ఆలస్యం అయిందని అడిగినందుకు స్విగ్గి డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరచిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి ఫుడ్ డెలివరీకి కస్టమర్ నుంచి ఆర్డర్ రావడంతో ఈ ఉదయం అక్కడికి వెళ్లిన స్విగ్గి డెలివరీ భాయ్ ఉపేందర్ వారిని ఆర్డర్ గూర్చి అడిగారు. కాసేపు వెయిట్ చేయమని హోటల్ యాజమాన్యం చెప్పడం తో అరగంట వెయిట్ చేశాడు. అయినా ఎంతకు ఆర్డర్ ఇవ్వక పోవడంతో ఇదే విషయాన్ని హోటల్ యజమానిని అడిగాడు స్విగ్గి డెలివరీ బాయ్.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోటల్ యజమాని, తన సిబ్బందితో కలిసి స్విగ్గి డెలివరీ బాయ్స్ పై రాడ్లు, కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు. అతనికి అండగా వచ్చిన రాము తో పాటు మరో ఇరవై మంది స్విగ్గి డెలివరీ బాయ్స్ పై దాడి చేశారు హోటల్ సిబ్బంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. తమకు న్యాయం చేయాలని హోటల్ ముందు ఆందోళనకు దిగారు స్విగ్గి డెలివరీ బాయ్స్. అయితే స్విగ్గి డెలివరీ బాయ్ తన మిత్రులతో కలిసి వచ్చి హోటల్ పై దాడికి పాల్పడ్డారని హోటల్ యాజమాన్యం, సిబ్బంది చెబుతున్నారు.