హైదరాబాద్ లో భారీ వర్షం.. స్థంభించిపోయిన ట్రాఫిక్

by Mahesh |
హైదరాబాద్ లో భారీ వర్షం.. స్థంభించిపోయిన ట్రాఫిక్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ మహానగరంలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో సాయంత్రం నుంచి నగరంలోని జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మేడ్చల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, అంబర్ పేట, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, రామంతపూర్, హయత్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, కుషాయిగూడ, ఈసీఐఎల్, జవహర్ నగర్, నల్లకుంట ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ కారణంగా నగరంలోని పలు కూడళ్లలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై భారీగా నీరు చేయడంతో వాహనాలు ముందుకు కదలక భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది నీటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు. అలాగే అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని, ద్విచక్ర వాహనాలు, కాలినడకన వెళ్లే వారు మ్యాన్ హోల్‌లను చూసుకుని వెళ్లాలని నగర పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఉప్పల్ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షం కారణంగా ఉప్పల్, నాగోల్ మెట్రలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో మెట్రోలో లిఫ్టులు ఎక్స్‌లేటర్లు పనిచేయక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Next Story

Most Viewed