- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
by srinivas |

X
దిశ,బంజారాహిల్స్: హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. ఏకధాటిగా 3 గంటల పాటు వర్షం కురవడంతో భాగ్య నగరం అతలాకుతలమైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఏకంగా 7.6 సెంటీమీటర్ల వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. అఫీస్ ల నుంచి ఇంటికెళ్లే సమయంలో భారీ వర్షం కురవడంతో బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని నరకయాతన అనుభవించారు.మరో భారీ వర్షంతో జీహెచ్ ఎం సీ అధికారులు, పోలీసులు ప్రజలని అత్యవసరం ఉంటే తప్పా ప్రజలని బయటకు రావద్దని కోరారు.
Next Story