- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీజేపీకి షాక్.. టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు..

దిశ, ఎల్బీనగర్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం శాసనసభ్యులు సుధీర్ రెడ్డి సమక్షంలో హస్తినాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, డివిజన్ అధ్యక్షులు సత్యంచారి ఆధ్వర్యంలో హస్తినాపురం డివిజన్ లోని ఇంద్రసేనారెడ్డి నగర్ కాలనీ బీ.జే.పీ.సీనియర్ నాయకులు ఆర్.లాలూ నాయక్, బాలాజీ నాయక్, బాలు నాయక్, పాండు నాయక్, రవి నాయక్, సక్రు నాయక్, హతిరం నాయక్ లతో పాటు దాదాపు 100 మంది బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆహ్వానం పలికారు.
అంతకుముందు ఇంద్రసేనరెడ్డి నగర్ లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను పార్టీ సాధించిందని తెలిపారు. గడిచిన సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అద్భుతాలు సాధించిందన్నారు. విజయాల దిశగా దూసుకెళ్లింది. మంచినీరు, సాగునీరు, సంక్షేమం, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు అందుకుంది. టీఆర్ఎస్ పార్టీ సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేరెడ్డి ఉదయ్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త అనిత, డేరంగుల కృష్ణ, నారగొని. శ్రీనివాస్ యాదవ్, రఘుమరెడ్డి, బాలం ఈశ్వర్, శివారెడ్డి, నాగిరెడ్డి, సయ్యద్ పాషా, విష్ణు, జనార్దన్, అరుణ్, దుబ్బ నాయక్, కపూర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, గోపీనాయక్, మంగళ నాయక్, భిక్షపతి నాయక్, హేమ నాయక్, ఆది నాయక్, నరేష్ నాయక్, సాయి, చిరంజీవి, విజయ్ యాదవ్ లతో పాటు ముఖ్య నాయకులు బస్తీ వాసులు పాల్గొన్నారు.