చిట్టి చేతులతో కఠినమైన పనులు...1051 మంది బాలబాలికలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి.

by Kalyani |
చిట్టి చేతులతో కఠినమైన పనులు...1051 మంది బాలబాలికలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి.
X

దిశ, సిటీక్రైం : వెట్టి చాకిరీ నుంచి బాలబాలికలను రక్షించి రాచకొండ పోలీసులు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలోనే రాచకొండ పోలీసులు మొత్తం 1051 మందిని బాలబాలికలను కాపాడారు. వీరితో అతి తక్కువ జీతంతో దాదాపు 9 గంటలకు పైగా పని చేసుకుంటున్నారని తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. 983 బాలురు, 139 మంది బాలికలతో పలువురు యజమానులు వెట్టి చాకిరీ చేయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇలా బాలబాలికలతో నిబంధనలకు విరుద్ధంగా పని చేయిస్తున్న వారిపై మొత్తం 464 ఎఫ్ఐఆర్ లను నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. దాదాపు 410 తనిఖీలు, ఫిర్యాదులపై జీడీ ఎంట్రీలు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి 540 మంది ఉండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు 511 మంది ఉన్నారు. వీరితో పని చేయించుకుంటున్న యజమానులపై చైల్డ్ లేబర్ యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద అభియోగాలను నమోదు చేశారు. ఇలా బాలబాలికలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు ఎవరైనా గుర్తిస్తే ఆ సమాచారాన్ని డయల్ 100 లేదా 1098 కు అందించాలని సీపీ సుధీర్ బాబు కోరారు. బాలబాలికలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో కలిసి వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పజెప్పారు. వారికి కూడా కౌన్సిలింగ్ ను పోలీసులు ఇచ్చారు.

Advertisement
Next Story