నాంపల్లి కోర్టులో నిందితుడి హల్చల్

by Disha Web Desk 15 |
నాంపల్లి కోర్టులో నిందితుడి హల్చల్
X

దిశ,కార్వాన్ : గాంజా కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడు తాను జైలుకు వెళ్లనంటూ హంగామా చేసిన ఘటన గురువారం నాంపల్లి కోర్టులో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గాంజా కేసులో శాలిబండ పోలీసులు నిందితుడుగా ఉన్న ఆనంద్ అగర్వాల్ ను గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు ఆనంద్ కు రిమాండ్ విధించింది.

అయితే ఆనంద్ ఈనెల 25న తన పెళ్లి ఉందని అయితే తాను జైలు కు వెళ్లనంటూ నిరాకరించి కోర్టు హాలులోని డోర్ అద్దాలను పగలగొట్టి హంగామా చేశాడు. అద్దాలు పగలడంతో ఆనంద్ చేతికి గాయాలయ్యాయి. అయితే ఇతని పై గాంజా కేసులు, ఓ మర్డర్ కేసు, దొంగతనం కేసులు మొత్తం 18 ఉన్నాయని, ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్లి నెల రోజుల క్రితమే రిలీజ్ అయ్యాడని సమాచారం.Next Story