- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బినామీలకే పెత్తనం.. గగ్గోలు పెడుతున్న రైతులు

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది. ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మహిళా సంఘాలు, పీఏసీఎస్‌లకు అప్పగించింది. ఈ కేంద్రాల నిర్వహణపై బినామీలు కన్నేశారు. గత వానాకాలం సీజన్‌లో కూడా నిర్వహణ పేరు మహిళా సంఘాలది అయితే పెత్తనం మాత్రం బినామీలుగా ఉన్న నిర్వాహకులే చెలాయించారు. మహిళా సంఘాల ప్రతినిధులను కేంద్రాలలో కూలీలుగా పెట్టి రోజువారీ కూలీ ఇచ్చేవారు. ఈసారి కూడా అదే ప్రణాళికతో బినామీలు మహిళా సంఘాలతో తీర్మానాలు పొందేందుకు లోపాయి కారి ఒప్పందాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే కేంద్రాలు కేటాయింపులు జరుగుతున్నట్లు విపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆకాల వర్షాలు, ప్రైవేటు మిల్లర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండటంతో పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు స్పీడ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8209 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసి 2100 సెంటర్లు తెరచి రైతులకు అందుబాటులో ఉంచింది. ఇప్పటివరకు 1.05 లక్షల మెట్రిక్‌టన్నులు కొనుగోలు చేసింది. మిగతా కేంద్రాలు దశల వారీగా పలు జిల్లాల్లో ప్రారంభించి జూన్ 30 వరకు కొనుగోలు చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.37 కోట్ల టన్నులు దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసి 70 లక్షల మెట్రిక్‌టన్నులు కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ టార్గెట్పెట్టుకుంది.
ధాన్యం సేకరణలో మోసాలు :
బస్తాకు హమాలీ ఖర్చులు వసూలు చేయడం నుంచి మిల్లులో ధాన్యం దించి వచ్చే వరకు ఎన్నో దోపిడీ జరుగుతోందనే ఆరోపణలు న్నాయి. క్వింటాకు రైతు నుంచి హమాలీ తీసుకునేది ఒక్క లెక్క హమాలీలకు ఇచ్చేది మరో లెక్కగా ఉంటుంది. ధాన్యం తూకంలో సాంకేతి కతను ఉపయోగించి ఒక్కో బస్తాకు కిలో నుంచి రెండు కిలోల వరకు అద నంగా తీసుకుంటారు. ధాన్యం మిల్లులో దించే ముందు వేబ్రిడ్జి తూకం వేసి కొనుగోలు చేసిన ధాన్యం రసీదులో ఉన్నదాని కంటే ఎక్కువగా చూపిస్తే అక్కడే మిల్లర్లకు అమ్మకాలు చేసి సొమ్ము ఇద్దరు పంచు కుంటారు. తర్వాత బినామీ రైతుల పేరుతో ధాన్యం కొనుగోలు చేసినట్లు పట్టా పాసు బుక్‌లు తీసుకుంటారు. మిలర్ల సహకారంతో డిఎస్ ఓ కార్యాలయంలో వాటిని నమోదు చేయిస్తారు. వచ్చే బోనస్ సొమ్మును మిల్లర్లు, రైతు, నిర్వా హకుడు దర్జాగా జేబులో వేసుకుంటారు. ధాన్యం సొమ్ము రైతు ఖాతా ద్వారా డ్రా చేయించి మిల్లర్లు తమ సొంత వ్యాపారాల కోసం వాడుకుంటారు. దానికి నిర్వాహకులు సహకారం అంది స్తారు. ఈవిధంగా ధాన్యం సేకరణలో అనేక రకాలుగా మోసాలు జరుగుతున్నాయి.
బీనామీ ఆదేశాల ప్రకారమే తూకం : ధాన్యం సేకరణ కేంద్రాల కేటాయింపులు మహిళల సంఘాలకు చేసిన పెత్తనమంతా అధికార పార్టీ నేతలదే. వారు చెప్పిన విధంగా రైతులు ధాన్యం తీసుకొస్తే ఎప్పడు తూకం వేయాలంటే అప్పడే వేయాలి. ముందుగా అధికార పార్టీకి చెందిన గ్రామ, మండల నాయకులంతా దాదాపు రైతులే కావడంతో వారు ధాన్యం తీసుకొస్తే సాయంత్రంలోగా తూకం వేయాల్సిందే. వారి ధాన్యంలో తాలు, తరుగు, పచ్చిధాన్యం ఉందని ఎలాంటి సాకులు చెప్పకుండా ఉండాలి. అదే విధంగా ఇతర పార్టీలకు చెందిన రైతులు వస్తే పచ్చిగా ఉందని రెండు రోజుల ఆరబెట్టాలని, బస్తాకు రెండు కిలోల తరుగు పేరుతో కోతలు పెడుతున్నారు. అధికారులు కూడా దొడ్డు ధాన్యం, సన్నదాన్యం గుర్తింపులో తేడాలుంటే బినామీలు చెప్పిన వారికి నిర్దారణ చేసి త్వరగా బోనస్రూ. 500 ఖాతాలో పడేలా వ్యవహరిస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు